Saturday 20 August 2016

INDIA IN RIO OLYMPICS




INDIA IN RIO OLYMPICS


We congratulate the special women who made INDIA  FEEL PROUD.

ఒలింపిక్స్రజతంతో కొత్త చరిత్ర 

ప్రత్యర్థి నవ్వుతోంది.. ప్రశాంతంగా కనిపిస్తోంది.. తుళ్లి తుళ్లి పడుతోంది.. ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది..ఆధిపత్యం చలాయిస్తోంది.. తన శక్తి సామర్థ్యాల్ని సంపూర్ణంగా వినియోగిస్తోంది.. చూసి చూసి బలహీనతల మీద కొడుతోంది!
ఇటువైపు మన సింధు నవ్వట్లేదు.. కంగారు పడుతోంది.. ఒత్తిడికి గురవుతోంది.. ఆత్మవిశ్వాసం కనిపించట్లేదు.. తన అత్యుత్తమ ఆట ఆడలేకపోతోంది.. తన బలాన్ని ప్రదర్శించలేకపోతోంది.. అనవసర తప్పిదాలు చేస్తోంది! ఏంటి తేడా...???
ప్రత్యర్థికి ఫైనలంటే ఫైనల్మాత్రమే! ఒలింపిక్స్వర్ణమంటే ఒలింపిక్స్వర్ణమే! కానీ మన సింధుకు అది ఒట్టి ఫైనల్కాదు.. ఒక మహా యుద్ధం! అది కేవలం పతకం కాదు.. 120 కోట్ల మంది అపురూప స్వప్నం!
పదుల కోట్ల కళ్లు తననే చూస్తున్నపుడు.. తన దేశ క్రీడా చరిత్రలోనే చరిత్రలోనే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్అయినపుడు.. ప్రతి భారత క్రీడాభిమానీ తన పేరే జపిస్తున్నపుడు.. ఉత్కంఠతో, ఉద్వేగంతో వూగిపోతున్నపుడు... తన విజయం కోసం ప్రార్థిస్తున్నపుడు.. తన దేశానికే స్వర్ణం అత్యంత అపురూపం అయినపుడు.. తన కన్నా ఎక్కువగా దేశమే పతకాన్ని కోరుకుంటున్నపుడు.. ఉండే ఒత్తిడిని కొలవగలమా?
అంత ఒత్తిడిలోనూ మన సింధు గొప్పగానే పోరాడింది. ఆరంభంలోనే వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుంది. చేజారే గేమ్నూ చేజిక్కించుకుంది. తర్వాతా హోరాహోరీగానే తలపడింది. ఓటమి అంచుల్లోనూ పోరాటం సాగించింది. చివరికి పసిడి ఆశల సౌధం కూలిపోయినా.. ఆమె కూలబడిపోలేదు. ఆమె పోరాటం, ఆమె నిబ్బరం చూసి భారతావని కూడా సరికొత్తగా స్పందించింది. క్రికెట్లోనో, హాకీలోనో మనోళ్లు ఓడినప్పట్లా తిట్లు లేవు, శాపనార్థాలు లేవు! నోట చూసినా ప్రశంసలే! పసిడి పోయిందని ఒకింత నిట్టూర్చినా.. నిరుత్సాహపడినా.. కొన్ని నిమిషాల్లోనే తేరుకునిశభాష్సింధూఅంటూ దేశమంతా మనమ్మాయిని కొనియాడింది. ఆడుతున్న తొలి ఒలింపిక్స్లోనే శతకోటి ఆకాంక్షల్ని నెరవేరుస్తూ పతకం సాధించిన సింధును మనస్ఫూర్తిగా అభినందించింది. సింధు సాధించింది రజతమే.. కానీ సింధు మాత్రం బంగారం!
కొన్నిసార్లు విజేతల కన్నా పోరాట యోధులే చెరగని ముద్ర వేస్తారు.
ప్రపంచం వారినే ఎక్కువ గుర్తుంచుకుంటుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది.
సింధూ.. నిన్ను గుర్తుంచుకుంటాం... గౌరవిస్తాం.. ప్రేమిస్తాం!
రియో డి జెనీరో
పతకమే రాదనుకున్న సమయంలో ఆశలు రేపింది.. ఉట్టి చేతులతో ఇంటికెళ్తామనుకున్న తరుణంలో సంచలనాలు సృష్టించింది.. కాంస్యంతోనే సరా అనుకుంటున్న సమయంలో రజతం ఖాయం చేసింది.. అసమాన పోరాటం.. అద్వితీయమైన ఆటతో స్వర్ణం దిశగా దూసుకెళ్ళింది.. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్‌.. నెంబర్‌వన్క్రీడాకారిణిని ఓడించినంత పనిచేసింది!.. కానీ.. 
కొన్ని పొరపాట్లు కొంపముంచాయ్‌.. కొన్ని అంచనాలు లెక్క తప్పాయ్‌.. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు షటిల్‌ను దారితప్పించాయ్‌.. అన్నీ కలిసి స్వర్ణం రేసులో వెనక్కి నెట్టాయ్‌! చివరికి రజతానికి పరిమితం చేశాయ్‌!.. అయితేనేం..
తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు బంగారమే! యావత్భారతావని ఆశల్ని సజీవంగా నిలిపిన సింధు పతకంతో మెరిసింది. శతకోటి ఆకాంక్షలు భుజాన మోసిన సింధు ఎవరూ సాధించని ఘనతను అందుకుంది. దిగ్గజాలు వెనుదిరిగిన గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. రియో ఒలింపిక్స్లో రజత పతకంతో సత్తాచాటింది. భారత బ్యాడ్మింటన్చరిత్రలో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో పోరాడి ఓడింది. ప్రత్యర్థి తనకంటే మెరుగ్గా ఆడినా.. చివరి వరకు పోరాడి శభాష్అనిపించుకుంది. సింధు చేతిలోఓడిన నొజొమి ఒకుహర (జపాన్‌) కాంస్యం సాధించింది. లీ జురుయ్‌ (చైనా) గాయంతో తప్పుకోవడంతో ఒకుహరకు కాంస్యం లభించింది.
ఇక ప్రత్యర్థి ప్రపంచ ఛాంపియనే. ప్రపంచ నెంబర్వన్క్రీడాకారిణే. టాప్సీడ్కూడా. విజయాల రికార్డూ మెరుగే. అయినా.. సింధు వెనక్కి తగ్గలేదు. స్వర్ణాలు గెలిచే సత్తాఉన్న క్రీడాకారిణుల్ని ప్రిక్వార్టర్స్‌.. క్వార్టర్స్‌.. సెమీస్లో కంగుతినిపించిన ఘనత ఆమె సొంతం. అత్యుత్తమ ఫిట్నెస్‌.. అత్యున్నత స్థాయి స్ట్రోక్లతో మంచి ఫామ్లో ఉంది కూడా. ఒకరకంగా ఫైనల్లో ఇద్దరూ సమవుజ్జీలే! ఇద్దరిపైనా భారీ అంచనాలే. అంతకుమించిన ఒత్తిడే! ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నల నడుమ ఒక గంటా 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో వెంట్రుకవాసి తేడాలో మారిన్దే పైచేయి అయింది.

శిక్షణ సాగినన్ని రోజులు వీరిద్దరు సూర్యోదయంతో పోటీ పడ్డారు. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే కోచింగ్ మధ్యలో రెండు స్వల్ప విరామాలు తప్ప మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాగేది. మళ్లీ సాయంత్రం మరో నాలుగు గంటల శిక్షణ. ముఖ్యంగా సింధు ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లో వచ్చిన తేడా కూడా ఒలింపిక్స్‌లో స్పష్టంగా తెలిసిపోతోంది. ట్రైనర్ ప్రత్యేక పర్యవేక్షణలో కసరత్తులు, వెయిట్ ఎక్స్‌ర్‌సైజ్‌లు... ఇలా గతంలో ఎప్పుడూ పట్టించుకోని విషయాలపై కూడా సింధు ఫోకస్ చేసింది. టైమ్‌టేబుల్‌ను, ప్రోగ్రాం చార్ట్‌ను కచ్చితంగా అనుసరించింది.  75 రోజుల్లో ఆమె ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా మిస్ కాలేదంటే ఆమె అంకితభావాన్ని, లక్ష్యసాధనపై ఉన్న పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. తదేక దీక్షతో ఆమె ఆటను తీర్చిదిద్దే పనిలో గోపీచంద్,   గురువు మనసెరిగిన శిష్యురాలిగా సింధు ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వలేదు.


SAKSHI MALIK

కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది.

Born on September 3, 1992, in Rohtak, Haryana, Sakshi Malik has her supportive parents, Sudesh and Sukhbir, to thank for encouraging her in her unusual career choice.

The 23-year-old from Mokhra village began her training in wrestling as a 12-year-old under the guidance of Ishwar Dahiya at an akhara in the Chotu Ram stadium. Her grooming was helped along by having to fight a lot of boys, in a region where the sport was ‘not for girls’. In fact, Dahiya faced protests from locals when he took Sakshi under his wing.The run-up to Rio2010: By the age of 18, she had tasted victory at junior-level competitions. She won a Bronze at the 2010 Junior World Championships in the 59-kg category.
2014: She first came to the international limelight after taking home the Gold at the Dave Schultz International Wrestling Tournament (60-kg).
July-August 2014: Her professional international career began with a silver medal in the 2014 Commonwealth Games in Glasgow, courtesy two 4-0 bouts.
September 2014: She crashed out in the Quarterfinal at the World Wrestling Championships in Tashkent. But not before beating her Senegalese opponent 4-1 in the Round of 16.
May 2015: Then on to the Senior Asian Wrestling Championships in Doha, where she won the Bronze.
On that victory, she said:“My silver at the 2014 Commonwealth Games is my personal favourite. Although I displayed some aggressive wrestling at the 2015 Asian Championships and clinched a bronze, my bout at Glasgow was more challenging.”Following that, Sakshi booked her seat on the flight to Rio by winning Bronze in the Summer Olympics Qualifiers, defeating Chinese Lan Zhang in the semifinal, at Istanbul.July 2016: She won 60-kg Bronze at the Spanish Grand Prix.


DIPA KARMAKAR : stood 4th in the world.


Most Indians today know the name Produnova thanks to Dipa.
It gets its name from the Russian gymnast Yelena Produnova who first attempted the vault in the 1990s. Known as the 'vault of death', it involves the gymnast doing a handspring and two or more front somersaults in the air before landing on one's feet.A wee miscalculation and you can land on your neck or spine and perhaps be damned for life. Most gymnasts don't even attempt the Produnova because of the risk involved.With just a few months of preparation, Dipa mastered the Produnova, hoping to clinch a medal at the Olympics. She may have missed a medal, but it's commendable she stood 4th in the world.