Saturday, 14 June 2014

This month inspiration - ANANDI BEN - GUJARAT CHIEF MINISTER





Anandiben Patel was born on 21 November 1941, in Kharod village of Vijapur taluka of Mehsana district, Gujarat. Her father Jethabhai was a farmer. She completed her education till 4th grade in a Girls’ school and was then admitted to Boys’ school as there was no other school in the district. She studied as a single girl among 700 boys. She moved to Nutan Sarv Vidyalay in Visnagar in 8th grade. She was awarded “VeerBala” award in Mehsana for her outstanding achievement in athletics. She joined M. G. Panchal Science College at Pilvai in 1960 and was the only girl in First Year Science in entire college. She completed her Bachelor's degree in Science in Visnagar later. She joined Mahila Vikas Gruh for the upliftment of women as her first job. She taught vocational courses to more than 50 widows.
She moved to Ahmedabad in 1965 with her husband Mafatbhai Patel and joined Master of Science. She took the responsibility of educating all the children of her extended family in Ahmedabad. In those days, more than 10 of her family member used to stay at her place in Ahmedabad. She joined Bachelor of Education to pursue her interest in teaching. She received gold medal in her M.Ed.
She joined as a school teacher in Mohniba School Vidyalaya in 1970. She was teaching subject like science and mathematics to higher secondary students. She later on became principal of the school. She declined all the other offers only to stay with Mohniba School Vidyalaya for 30 years even while she was in important political positions.
Political career
Anandiben Patel's entry into politics began with an accident during school picnic in 1987. Two girl students from her school accidentally tripped over and fell into the river Narmada. In the midst of such a desperate situation, she jumped into the raging river and single handedly saved two drowning girls. She even received president's bravery award for this. Impressed by this heroic act, BJP top cadre suggested Anandiben Patel to join the party. She initially declined the offer but later while volunteering for drought relief program she saw politics as a means of service to people and joined BJP as the Gujarat Pradesh Mahila Morcha President in 1987.
Her first notable work was during a spread of bird flu in Viramgam district affecting children where she spent weeks helping local citizens and enforcing the government officials to take strong action. In 1992, she joined as the only woman leader from Gujarat in Ekta yatra (journey for unity) led by BJP with BJP veteran Murli Manohar Joshi
As a member of Parliament]
Anandiben patel was elected to Rajyasabha from Gujarat in 1994. As an MP, she participated in the Fourth World women's Conference at Beijing (China) in 1994-95 representing India. She also Visited Bulgaria with the BJP Leader Atal Bihari Vajpayee and speaker of the Loksabha - P.A. Sangma.
1998 - First election in Mandal (As an education Minister
Anandiben Patel resigned from Rajyasabha in 1998 and contested her first assembly election from Mandal assembly seat in Ahmedabad district of Gujarat. She became the State Minister in Government of Gujarat under the leadership of Keshubhai Patel. Later, she became the fifth ever Woman Cabinet Minister of Gujarat and was assigned the Education portfolio. In her first term as Education Minister she started “Lokdarbar” to solve issues related to schools and education on the spot. It was under her leadership, that the state Government first launched “Shala Praveshosav” to increase enrollment in schools, which is still the flagship program of Education department. Her efforts resulted in 100% increase in enrollment.. In the first two years as an Education Minister, she initiated a campaign to recruit 26,000 teachers to fill up the vacant positions for the last 6 years. She is also credited for her outstanding work to reduce corruption in transfer of teachers. She also decided to set up separate school for handicapped children.
Second and Third Election from Patan (2002-2012
Anandiben Patel fought her second and third assembly elections under the leadership of Narendra Modi in 2002 and 2007 from Patan Constituency. Against the familiar trend of Education Minister not being elected again, she won the election in 2002 and in 2007. She continued as a Cabinet Minister for Education in her second term and was assigned two other important portfolios Roads & Building and Revenue in her third term. Anandiben, in her term of 10 years in Patan, worked tirelessly for the development of the region. Few of the high impact projects that took place during her time are, connecting Patan with Narmada canal for the welfare of farmers, creating 174 check dams in the region, building one of the largest water filtration plant to provide citizens of Patan with pure drinking water, a new medical and engineering college in the region, creation of more than 700 km worth road network and an underground drainage system. Patan today hosts world’s second largest photo-voltaic solar plant.
2012 - Fourth term election from Ghatlodiya
Amidst great speculation on her election assembly, Anandiben Patel moved to Ghatlodiya constituency of Ahmedabad for 2012 elections. She won with margin of more than 1.75 lakhs vote. Anandiben’s charismatic presence won her the maximum lead in the state.
2014 - Chief Minister of Gujarat
On 22-May 2014,Anandiben Patel took oath as 15th Chief Minister of Gujarat to succeed Narendra Modi after latter was elected as Prime Minister of India following the spectacular victory of BJP in the Indian general election, 2014. Ms. Patel’s name was proposed and adopted unanimously at a meeting of the Legislature Party in the presence of Mr. Modi, who had moments earlier resigned as the Chief Minister. Ms. Patel is the first woman Chief Minister of Gujarat. 
Personal life
Anandiben married to Mafatlal on 26 May 1962 who was then 28 years old. After living in Mehsana district for four years, they moved to Ahmedabad. Mafatlal was a professor of Psychology at the Saraspur Art and Commerce College and Anandiben taught mathematics and science and later became principal of Mohinaba Kanya Vidyalaya on Ashram Road, Ahmedabad. She voluntarily retired after teaching for 31 years. She has two children Sanjay Patel and Anar Patel.


PURNA - THE YOUNGEST WOMAN TO SCALE EVEREST



ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన  పూర్ణ




చిన్న వయసు.. పెద్ద లక్ష్యం.. ముందున్నది ప్రపంచంలోనే ఎత్తై ఎవరె స్ట్ శిఖరం.. అధిరోహించాలంటే కొండంత ధైర్యం, అంతే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం.. మైనస్ నలభై డిగ్రీల చలి, కాలుతీసి కాలు వేయలేనంత మంచు.. కాలి బూట్లే 10 కిలోలు, భుజాన మరో 20 కేజీల బ్యాగ్..

ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపెద్దవారికే సాధ్యంకాని ఎవరెస్ట్ అధిరోహణ.. వీరికెలా సాధ్యమంటూ అంతా ఆశ్చర్యంగా చూసినా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్కుమార్లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి ఇక్కడి ఏపీభవన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మిగతా ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు మే 25 ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి పూర్ణ రికార్డు సృష్టించగా, 17 ఏళ్ల ఆనంద్ సైతం అరగంట తేడాతో శిఖారాన్ని చేరుకొని తెలుగు వారి సత్తా చాటిన విషయమూ విదితమే. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ అందించిన సహకారం.. శిక్షకులు శేఖర్, పరమేష్ సారథ్యంలో సాగిన ఎవరెస్ట్ అధిరోహణ అనుభవాలను వారిద్దరూ మీడియాతో పంచుకున్నారు

 అవకాశం దొరికితే మరోమారు అధిరోహిస్తా: పూర్ణ
 ‘‘నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళుతున్నా అని చెప్పగా నా తల్లిదండ్రులు ముందు కంగారుపడ్డా, తర్వాత అంగీకరించారు. నువ్వు సాధిస్తావ్ అని ప్రోత్సహించారు. వారి ఆశీర్వాదం, స్వేరోస్ కార్యదర్శి ప్రవీణ్కుమార్ ప్రోత్సాహం, శేఖర్, పరమేష్లు ఇచ్చిన శిక్షణతో ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమయ్యాం. భువనగిరి రాక్లైప్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే అంత పెద్ద బండను చూసి భయపడిపోయా. ఇంత పెద్ద బండను ఎలా ఎక్కుతామని అనుకున్నా. కానీ శేఖర్, పరమేష్ ప్రోత్సాహంతో రోజూ బండను ఎక్కుతుంటే భయం పోయింది. ఉత్సాహంతోనే డార్జిలింగ్లోని పినాక్ పర్వతాన్ని ఎక్కాం. తర్వాత లఢఖ్లో చలిని తట్టుకుని, జారుడు రాళ్లపై నడవడం నేర్చుకున్నాక మాలో పట్టుదల పెరిగింది.

ఉత్సాహంతోనే ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాం. చాలా క్లిష్ట వాతావరణంలో, అంతకన్నా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం సాగింది. మైనస్ 40 డిగ్రీల చలిలో, జారుడు మంచును దాటుకుంటూ వెళ్లేందుకు చాలా కష్టపడ్డా. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాం. కొద్దిదూరం వెళ్లాకఆరు శవాలు కనిపించాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయాం. అయితే, దేనికీ వెరవకుండా, వె నక్కి చూడకుంగా ముందుకు సాగడమే సాహసం, అదే జీవితం అన్న మా గురువు ప్రవీణ్కుమార్ మాటలు గుర్తొచ్చి మరింత దృఢ విశ్వాసంతో ముందుకు సాగాం. మా దృఢ సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నగా అయిపోయింది. అన్నీ దాటుకుంటూ చివరికి ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాం. నేను రోజు అందరికన్నా ఎత్తై ప్రదేశంలో ఉన్నాను అనే భావన కలిగి చాలా గర్వంగా ఫీలయ్యా.

నా తల్లిదండ్రులు, ప్రవీణ్కుమార్ సార్ గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అక్కడే జాతీయ జెండా, తెలంగాణ జెండాను ఎగురవేసి.. బీఆర్ అంబేద్కర్, సాంఘిక సంక్షేమ శాఖకు వన్నెతెచ్చిన ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ ఫోటోలను అక్కడ ఉంచాం. బాలికలు ఏదైనా చేయగలరు. బాలుర కంటే ఎక్కువ చేయగలరు. నాకు మళ్లీ అవకాశం ఇస్తే మరోమారు ఎవరెస్ట్ ఎక్కడానికి సిధ్దంగా ఉన్నా. విజయాన్ని మా స్వేరోస్ టీమ్ మొత్తానికి అంకితమిస్తున్నా. ఇక మీదట చదువుపై దృష్టిపెడతా. ముందు పదో తరగతి పాసవ్వాలి. ఐపీఎస్ అయి, పేదలకు సేవ చేయాలన్నదే నా సంకల్పం’’.

  సవాల్గా తీసుకుని ముందుకెళ్లా: ఆనంద్
 ‘‘ముందుగా భవనగిరి రాక్లైన్ స్కైల్లో పెద్ద రాయిని ఎక్కడానికే ఎంతో భయమేసింది. అయితే మా ట్రైనర్స్ ఇచ్చిన ధైర్యంతో దాన్ని ఎక్కగలిగా. తర్వాత పీనాక్ శిఖరాన్ని ఎక్కడంతోపాటు లడఖ్లో కఠిన శిక్షణ తీసుకున్నాం. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా అన్నీ తట్టుకోగలిగాం. ఇక 20 కేజీల బరువును భుజాన వేసుకొని, మంచు రాళ్ల మధ్య ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగూ భయానకమే. వాతావరణం ఏమాత్రం సహకరించదు. సమయంలో.. ‘నేను ఎంత కష్టమొచ్చినా వెనక్కి వెళ్లను’, ‘దేనికీ భయపడను’, ‘నీవు ఎవరికీ తక్కువ కాదు’, ‘ముందుకు సాగడమే జీవితంఅని మాకు శిక్షణలో నేర్పిన సూత్రాలు గుర్తొచ్చాయి. అవి నాపై బాగా ప్రభావం చూపించాయి.

దీంతో ఎవరెస్ట్ అధిరోహణను సవాల్గా తీసుకున్నా. 7,400 మీటర్ల ఎత్తు చేరాక ఊపిరి సరిగా అందేది కాదు. అక్కడికి వచ్చేసరికే ప్రాణం పోయినంత పనైంది. చివరి క్యాంపు చేరాలంటే రాత్రిపూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాలి. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకదు. సమయంలో కిందపడ్డా. చాలా భయమేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాం. ఎవరెస్ట్ చేరాక జాతీయజెండా, తెలంగాణ జెండా ఎగురవేశాం. ఎంతో గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించామనిపించింది. తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డా. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా వచ్చా. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంది. ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కుందుకు నేను రెడీ’’.