INDIA IN RIO OLYMPICS
We congratulate the special women who made INDIA FEEL PROUD.
ఒలింపిక్స్ రజతంతో కొత్త చరిత్ర
ప్రత్యర్థి నవ్వుతోంది.. ప్రశాంతంగా కనిపిస్తోంది.. తుళ్లి తుళ్లి పడుతోంది.. ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది..ఆధిపత్యం చలాయిస్తోంది.. తన శక్తి సామర్థ్యాల్ని సంపూర్ణంగా వినియోగిస్తోంది.. చూసి చూసి బలహీనతల మీద కొడుతోంది!
ఇటువైపు మన సింధు నవ్వట్లేదు.. కంగారు పడుతోంది.. ఒత్తిడికి గురవుతోంది.. ఆత్మవిశ్వాసం కనిపించట్లేదు.. తన అత్యుత్తమ ఆట ఆడలేకపోతోంది.. తన బలాన్ని ప్రదర్శించలేకపోతోంది.. అనవసర తప్పిదాలు చేస్తోంది! ఏంటి తేడా...???
ప్రత్యర్థికి ఫైనలంటే ఫైనల్ మాత్రమే! ఒలింపిక్ స్వర్ణమంటే ఒలింపిక్ స్వర్ణమే! కానీ మన సింధుకు అది ఒట్టి ఫైనల్ కాదు.. ఒక మహా యుద్ధం! అది కేవలం పతకం కాదు.. 120 కోట్ల మంది అపురూప స్వప్నం!
పదుల కోట్ల కళ్లు తననే చూస్తున్నపుడు.. తన దేశ క్రీడా చరిత్రలోనే చరిత్రలోనే ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్ అయినపుడు.. ప్రతి భారత క్రీడాభిమానీ తన పేరే జపిస్తున్నపుడు.. ఉత్కంఠతో, ఉద్వేగంతో వూగిపోతున్నపుడు... తన విజయం కోసం ప్రార్థిస్తున్నపుడు.. తన దేశానికే ఆ స్వర్ణం అత్యంత అపురూపం అయినపుడు.. తన కన్నా ఎక్కువగా దేశమే ఆ పతకాన్ని కోరుకుంటున్నపుడు.. ఉండే ఒత్తిడిని కొలవగలమా?
అంత ఒత్తిడిలోనూ మన సింధు గొప్పగానే పోరాడింది. ఆరంభంలోనే వెనుకబడ్డా అద్భుతంగా పుంజుకుంది. చేజారే గేమ్నూ చేజిక్కించుకుంది. తర్వాతా హోరాహోరీగానే తలపడింది. ఓటమి అంచుల్లోనూ పోరాటం సాగించింది. చివరికి పసిడి ఆశల సౌధం కూలిపోయినా.. ఆమె కూలబడిపోలేదు. ఆమె పోరాటం, ఆమె నిబ్బరం చూసి భారతావని కూడా సరికొత్తగా స్పందించింది. క్రికెట్లోనో, హాకీలోనో మనోళ్లు ఓడినప్పట్లా తిట్లు లేవు, శాపనార్థాలు లేవు! ఏ నోట చూసినా ప్రశంసలే! పసిడి పోయిందని ఒకింత నిట్టూర్చినా.. నిరుత్సాహపడినా.. కొన్ని నిమిషాల్లోనే తేరుకుని ‘శభాష్ సింధూ’ అంటూ దేశమంతా మనమ్మాయిని కొనియాడింది. ఆడుతున్న తొలి ఒలింపిక్స్లోనే శతకోటి ఆకాంక్షల్ని నెరవేరుస్తూ పతకం సాధించిన సింధును మనస్ఫూర్తిగా అభినందించింది. సింధు సాధించింది రజతమే.. కానీ సింధు మాత్రం బంగారం!
కొన్నిసార్లు విజేతల కన్నా పోరాట యోధులే చెరగని ముద్ర వేస్తారు.
ప్రపంచం వారినే ఎక్కువ గుర్తుంచుకుంటుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది.
సింధూ.. నిన్ను గుర్తుంచుకుంటాం... గౌరవిస్తాం.. ప్రేమిస్తాం!
రియో డి జెనీరో
పతకమే రాదనుకున్న సమయంలో ఆశలు రేపింది.. ఉట్టి చేతులతో ఇంటికెళ్తామనుకున్న తరుణంలో సంచలనాలు సృష్టించింది.. కాంస్యంతోనే సరా అనుకుంటున్న సమయంలో రజతం ఖాయం చేసింది.. అసమాన పోరాటం.. అద్వితీయమైన ఆటతో స్వర్ణం దిశగా దూసుకెళ్ళింది.. ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్.. నెంబర్‌వన్ క్రీడాకారిణిని ఓడించినంత పనిచేసింది!.. కానీ..
కొన్ని పొరపాట్లు కొంపముంచాయ్.. కొన్ని అంచనాలు లెక్క తప్పాయ్.. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు షటిల్‌ను దారితప్పించాయ్.. అన్నీ కలిసి స్వర్ణం రేసులో వెనక్కి నెట్టాయ్! చివరికి రజతానికి పరిమితం చేశాయ్!.. అయితేనేం..
కొన్ని పొరపాట్లు కొంపముంచాయ్.. కొన్ని అంచనాలు లెక్క తప్పాయ్.. కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు షటిల్‌ను దారితప్పించాయ్.. అన్నీ కలిసి స్వర్ణం రేసులో వెనక్కి నెట్టాయ్! చివరికి రజతానికి పరిమితం చేశాయ్!.. అయితేనేం..
తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు బంగారమే! యావత్ భారతావని ఆశల్ని సజీవంగా నిలిపిన సింధు పతకంతో మెరిసింది. శతకోటి ఆకాంక్షలు భుజాన మోసిన సింధు ఎవరూ సాధించని ఘనతను అందుకుంది. దిగ్గజాలు వెనుదిరిగిన గడ్డపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. రియో ఒలింపిక్స్లో రజత పతకంతో సత్తాచాటింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 21-19, 12-21, 15-21తో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడింది. ప్రత్యర్థి తనకంటే మెరుగ్గా ఆడినా.. చివరి వరకు పోరాడి శభాష్ అనిపించుకుంది. సింధు చేతిలోఓడిన నొజొమి ఒకుహర (జపాన్) కాంస్యం సాధించింది. లీ జురుయ్ (చైనా) గాయంతో తప్పుకోవడంతో ఒకుహరకు కాంస్యం లభించింది.
ఇక ప్రత్యర్థి ప్రపంచ ఛాంపియనే. ప్రపంచ నెంబర్‌వన్ క్రీడాకారిణే. టాప్ సీడ్ కూడా. విజయాల రికార్డూ మెరుగే. అయినా.. సింధు వెనక్కి తగ్గలేదు. స్వర్ణాలు గెలిచే సత్తాఉన్న క్రీడాకారిణుల్ని ప్రిక్వార్టర్స్.. క్వార్టర్స్.. సెమీస్లో కంగుతినిపించిన ఘనత ఆమె సొంతం. అత్యుత్తమ ఫిట్నెస్.. అత్యున్నత స్థాయి స్ట్రోక్లతో మంచి ఫామ్లో ఉంది కూడా. ఒకరకంగా ఫైనల్లో ఇద్దరూ సమవుజ్జీలే! ఇద్దరిపైనా భారీ అంచనాలే. అంతకుమించిన ఒత్తిడే! ఎన్నో సందేహాలు.. మరెన్నో ప్రశ్నల నడుమ ఒక గంటా 20 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో వెంట్రుకవాసి తేడాలో మారిన్దే పైచేయి అయింది.
శిక్షణ సాగినన్ని రోజులు వీరిద్దరు సూర్యోదయంతో పోటీ పడ్డారు. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే కోచింగ్ మధ్యలో రెండు స్వల్ప విరామాలు తప్ప మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాగేది. మళ్లీ సాయంత్రం మరో నాలుగు గంటల శిక్షణ. ముఖ్యంగా సింధు ఆటలోనే కాదు ఫిట్‌నెస్‌లో వచ్చిన తేడా కూడా ఒలింపిక్స్‌లో స్పష్టంగా తెలిసిపోతోంది. ట్రైనర్ ప్రత్యేక పర్యవేక్షణలో కసరత్తులు, వెయిట్ ఎక్స్‌ర్‌సైజ్‌లు... ఇలా గతంలో ఎప్పుడూ పట్టించుకోని విషయాలపై కూడా సింధు ఫోకస్ చేసింది. టైమ్‌టేబుల్‌ను, ప్రోగ్రాం చార్ట్‌ను కచ్చితంగా అనుసరించింది. ఈ 75 రోజుల్లో ఆమె ఒక్కటంటే ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా మిస్ కాలేదంటే ఆమె అంకితభావాన్ని, లక్ష్యసాధనపై ఉన్న పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. తదేక దీక్షతో ఆమె ఆటను తీర్చిదిద్దే పనిలో గోపీచంద్, గురువు మనసెరిగిన శిష్యురాలిగా సింధు ఎక్కడా ఉదాసీనతకు తావు ఇవ్వలేదు.
SAKSHI MALIK
కాంస్య పతక పోరులో సాక్షి 8-5 పాయింట్ల తేడాతో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది.