Thursday, 3 January 2019

SERENA WILLIAMS INSPIRED BY WORKING WOMEN


పనిచేసే మాతృమూర్తులే తనకు స్ఫూర్తి అన్న సెరెనా
అమ్మంటే అనుబంధం... అమ్మయితే ఆనందం... పనిచేసే మహిళలు అమ్మ హోదా వచ్చాక బిడ్డను చూసుకునేందుకు ఇంటి వద్దే ఆగిపోకుండా తమ వృత్తిగత జీవితంలో ముందుకు సాగిపోతున్నారని... రెంటికి న్యాయం చేస్తున్న అలాంటి తల్లులే నాకు స్ఫూర్తి అంటోంది అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌. హాప్‌మన్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్విట్జర్లాండ్‌ జట్టుతో తలపడే ముందు ఆమె తన గారాలపట్టి ఒలింపియాను భుజంపై ఎత్తుకునే వార్మప్‌ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోల్ని ఇన్‌స్ట్రాగామ్‌లో పెట్టింది. దీనికి స్ఫూర్తిదాయక సందేశాన్ని జతచేసింది.

మాతృమూర్తులకు ఏదైనా సాధ్య మే. అమ్మతనానికి అడ్డువుండదు. నేనైతే కొత్త ఏడాదిలో తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్నా. నా చిట్టితల్లి మాత్రం నా ఒడిలోనే నిద్రపోతోంది. అలాగని కసరత్తు ఆపలేను. కుమార్తెనూ దించలేను. ఈ విషయంలో పనిచేసే తల్లిదండ్రులే నాకు ప్రేరణ. చంటిబిడ్డల తల్లులు చేస్తున్న ఉద్యోగాలు... పడుతున్న కష్టాలు విన్నప్పుడు, చదివినపుడు నేను కూడా అలా చేయగలను అనిపించింది. ఇలా వారు జీవితంలో చేస్తున్న పోరాటానికి నా వందనంఅని సెరెనా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.