నవ్వు
నా హృదయ సాగరంలో నీవో ఆణిముత్యమని
సన్నిహితునికి ఊరట కలిగించు నవ్వు
నా యెద లోయల్లో నిర్మల జలపాతము
పరవళ్లు త్రొక్కేనని తెలుపు చిరునవ్వు
నా యెడ నొరులు చూపు ప్రేమానురాగాలకు
స్పందన చూపించు ముసిముసి నవ్వు
నా ముఖారవిందమున్ రేకులు ముడుచుకొనక
విప్పారి వికసింపజేయు హుందాతనపు నవ్వు
ఎదుటి వారికి వుత్తేజము కలిగించి
వారి మదిన చైతన్యపు జల్లు కురిపించు నవ్వు
రాగ ద్వెషములు బాసి ప్రేమ జ్యోతిని
ఈ జగాన వెలిగించు ఓ నవ్వు
క్రోధాగ్నితో రగిలిపోవు పరుల హృథిని
చల్లగ జేయు సమీరమౌ ఓ నవ్వు
నా అధర వీణియ
పైన సప్త స్వరములై
స్వరజతులు శృతి చేయనిమ్ము స్వామీ!!
నను నవ్వ నివ్వు స్వామీ !!
- న. పద్మ
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.